జనం మీద కుహనా ప్రచార దాడి!

2020 ఆగస్టులో అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ప్రచురించిన వార్త ఒక రాజకీయ తుపాన్‌ రేపింది. ఫేస్‌బుక్‌లో విద్వేష ప్రచారం చేసే బీజేపీ నేతల పోస్టులను తొలగించకుండా సదరు సంస్థ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌గా ఉన్న అంఖీదాస్‌ చూశారన్నది దాని సారం కాగా, ఆమె బీజేపీకి ఎంత వీర విధేయురాలో సాక్ష్యాలతో సహా వెల్లడించింది. ”మనం అతని (నరేంద్రమోడీ) సామాజిక మాధ్యమ మంట రగిల్చాం తరువాత చరిత్ర మీకు తెలిసిందే. ఎట్టకేలకు భారత ప్రభుత్వ సోషలిజాన్ని వదిలించుకొనేందుకు గాను దిగువ స్థాయి నుంచి చేసిన పనికి ముఫ్పై ఏండ్లు పట్టింది” అంటూ ఆమె 2014లో గెలిచిన సందర్భంగా మోడీని పొగడటం, కాంగ్రెస్‌ ఓడిపోవటం గురించి రాసిన రాతలను ఆ పత్రిక వెల్లడించింది. భారత జార్జి బుష్‌గా నరేంద్రమోడీని ఆమె వర్ణించారు. 2012 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సామాజిక మాధ్యమ విభాగానికి ఆమె ఇచ్చిన శిక్షణ గురించి కూడా పేర్కొన్నది. ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే ఇజ్రాయెల్‌కు చెందిన ”టీమ్‌ జార్జి” పేరుతో టాల్‌ హనాన్‌ బృందం 33 దేశాలలో ఎన్నికల సందర్భంగా నిర్వహించిన తప్పుడు ప్రచారం గురించి ఒక అంతర్జాతీయ జర్నలిస్టుల బృందం పరిశోధించి వెలుగులోకి తెచ్చిన అంశా లను బ్రిటన్‌కు చెందిన గార్డియన్‌ పత్రిక తాజాగా వెల్లడించించింది. అంతే కాదు న్యూయార్క్‌ నగరం కేంద్రంగా ఐరాస-యునెస్కో నిధులతో పని చేస్తున్న జర్నలిస్టుల అంతర్జాతీయ కేంద్రం (ఐసిఎఫ్‌జె) నివేదిక కూడా వెల్లడైంది. దానిలో భారత్‌కు చెందిన మహిళా జర్నలిస్టులు రానా అయూబ్‌ను వేధించుతున్న, గౌరీ లంకేష్‌ ప్రాణాలను బలిగొన్న బీజేపీ అనుబంధ బృందాల గురించి వెల్లడించారు.
ఈ రెండు నివేదికల్లోని అంశాలు ప్రజాస్వామ్య వాదులకు, నిబద్దత కలిగిన జర్నలిజం వృత్తిగా ఉన్నవారికి ఆందోళన కలిగిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తిష్టవేసిన కాషాయదళాలు ఎలాంటి పాత్ర నిర్వహిస్తున్నాయో వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. పత్రికలు, టీవీలు మినహాయింపు కాదు. విద్వేష ప్రచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విటర్లలో ప్రచారం చేయటం ఒకటైతే పత్రికల్లో రాతలు, టీవీల్లో చర్చల పేరుతో రెచ్చగొట్టే అంశాలను ముందుకు తేవటం మరొకటి. టీమ్‌ జార్జి వంటి సంఘటిత బృందాలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఊరూపేరులేని వాటి ఉత్పత్తులు నిరంతరం వాట్సాప్‌ల్లో మనం కోరకుండానే వచ్చిపడుతుంటాయి. ఇవి రక్తం చిందకుండానే ప్రాణాలు తీసే ఆయుధాలంటే అతిశయోక్తి కాదు. ఊరూపేరు లేకుండా, లేదా అపహరించిన ఫొటోలతో వారికి తెలియకుండానే ఖాతాలు తెరిచి తమ అజెండా ప్రకారం ప్రచారం చేసే ముఠాలే ఇవి. అలాంటి పని చేస్తున్న టీమ్‌ జార్జి ముఠా అది తప్పేమీ కాదని చెప్పటమే కాదు, అందుకు గాను ఎంత మొత్తాలను వసూలు చేస్తున్నదీ వెల్లడించారు. ఒక ఆఫ్రికా దేశ నేత ప్రతినిధులమని, ప్రచారం చేసేందుకు సేవలు కావాలంటూ వెళ్లిన జర్నలిస్టులకు వారు చెప్పిన సమాచారం, తమ పనిని ప్రదర్శించిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఎన్ని దేశాల్లో ఇలాంటి కుహనా ప్రచారకులు ఎందరు ఉన్నదీ ఊహించుకోవాల్సిందే తప్ప లెక్కించలేం. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చు కొనేందుకు, ప్రత్యర్థులను బదనామ్‌చేసి దెబ్బతీసేందుకు గూఢచార సంస్థలు, రాజకీయపార్టీలు, వాణిజ్య సంస్థలు కూడా ఇలాంటి ప్రచార ఆయుధాలతో దాడులు చేసే కిరాయిమూకలను రంగంలోకి దించుతున్నాయి. చివరికి ఇవి భార్యాభర్తల ఫోన్లు, సామాజిక మాధ్యమ ఖాతాలలో ప్రవేశించి అనుమానాలు, విబేధాలను రగిలిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్‌ ఇంపాక్ట్‌ మీడియా సొల్యూషన్స్‌ (ఎయిమ్స్‌) అనే సాప్ట్‌వేర్‌ 30వేల నకిలీ ఖాతాలను నిర్వహిస్తుందంటే తప్పుడు ప్రచారానికి ఉన్న బలం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
స్టోరీ కిల్లర్స్‌ ప్రాజెక్టు పేరుతో మహిళా జర్నలిస్టుల మీద రూపొందించిన వివరాలను ఐసిఎఫ్‌జె వెల్లడించింది. ఈ సంస్థ షెఫీల్డ్‌ విశ్వవిద్యాలయ కంప్యూటర్‌ నిపుణుల సహకారంతో భారత జర్నలిస్టులు రానా అయూబ్‌, గౌరీ లంకేష్‌, అల్‌ జజీరా యాంకర్‌ ఘదా క్వియిస్‌ తదితరుల గురించి నివేదికలను రూపొందించారు. వీరు కూడా ”విస్మృత కథలు” సంస్థతో సమన్వయం చేసుకున్నారు. స్త్రీ ద్వేషం, బూతులు, ఆమె మతం, రాసిన రాతల మీద ద్వేషం వెళ్లగక్కుతూ రానా అయూబ్‌ మీద ప్రతి పద్నాలుగు సెకండ్లకు ఒక ట్వీట్‌ చేసినట్లు తేలింది. ఒక ట్వీట్‌ రాగానే ఒకటి రెండు నిమిషాల్లో దాని మీద వందల వేల ప్రతికూల స్పందనలు వెలువడటం అంటే అవి కంప్యూటర్లకు పుట్టినవి తప్ప మనుషులకు కాదు అన్నది స్పష్టం.ఈ ఆన్‌లైన్‌ హింసతో పాటు ఆమె ప్రాణాలు తీస్తామని, లైంగికదాడి చేస్తామన్న బెదిరింపులు సరేసరి. ఆమెకు ప్రాణహాని ఉందని ఐదుగురు ఐరాస ప్రతినిధులు 2018లోనే హెచ్చరికను జారీచేశారు. ఇక ఆల్‌ జజీరా యాంకర్‌ ఘదా క్వియిస్‌ గురించి ఒక మహిళ మీద ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయవచ్చో అన్నీ చేశారు. గుజరాత్‌ మారణకాండ గురించి డాక్యుమెంటరీ నిర్మించిన బిబిసి మీద ఉక్రోషంతో దాని కార్యాలయాల మీద జరిపించిన దాడుల గురించి చూసిన తరువాత మన దేశంలో భిన్న గళాలను అణచివేసేందుకే కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని మరోసారి స్పష్టమైంది. జర్నలిస్టులను బెదిరించటమే కాదు, వారికి ప్రాణహాని కూడా ప్రపంచమంతటా ఉన్నదని చెబుతున్న నివేదికలు మన దేశంలోని ప్రజాస్వామ్యవాదులకు ఒక హెచ్చరిక కావాలి. తన ఎన్నిక కేసులో ఓడిన ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ప్రకటించి పత్రికల మీద సెన్సారు పేరుతో వ్యతిరేక వార్తలను నిషేధించిన దానికి, బిబిసి డాక్యుమెంటరీని సామాజిక మాధ్యమాల్లో నిషేధించిన నరేంద్రమోడీ సర్కార్‌ నిర్వాకానికి పెద్ద తేడా లేదు. ఇది ఒక ట్రైలర్‌ మాత్రమే, సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే!

Spread the love
Latest updates news (2024-07-04 09:17):

low blood sugar S9H symptoms metformin | what should my blood sugar levels be 9xx nondiabetic | bcD blood sugar drops two hours after breakfast | good average blood sugar I4J | can blood pressure N2P med cause blood sugar | blood sugar levels 62 O4Q | low blood sugar hours azs after eating | x3w constant low blood sugar during pregnancy | can a large salad 6o6 spike your blood sugar | olive oil lower blood 03N sugar | is XPD beer bad for your blood sugar | food that stabilizes blood sugar OSo | drugs that raise PO8 blood sugar | what happens when blood Fvy sugar levels become too high | can frequent blood transfusions cause increased blood fnF sugar | how can 13K you naturally lower blood sugar | what causes a blood sugar spike e0H | will drinking t2X coffee effect fasting blood sugar | signs and symptoms of cL6 someone with low blood sugar include | can jxD quinapril raise blood sugar | blood 9ic sugar high or low symptoms | 2rd blood sugar control naturally | normal blood sugar in adult kgx | will exercise help bring rgy blood sugar | can low blood sugar affect your eyes SvO | OsN fruit sugar and blood sugar | blood sugar low symptoms in wL0 hindi | high tAG and low blood sugar symptoms chart | diabetes blood sugar ucV level scale | does low hNJ blood sugar mean your diabetic | why does RJQ my blood sugar spike during the night | fkb what drinks help lower blood sugar | does wellbutrin increase blood cOz sugar | what is the average blood sugar St9 for a man | best blood sugar testing 2tt machine in sri lanka | fasting blood 8EA sugar test definition | glutamine increase blood Om8 sugar | blood sugar q9e drop and nausea | blood sugar check 2 weeks lab woF test | best 8NX time to check fasting blood sugar in the morning | blood sugar for dka xI5 | 5TA diabetes symptoms low blood sugar | keto diet 6Ik blood sugar too low | effect of dKV alcohol on blood sugar test | Oyg is 114 normal blood sugar level | pregnancy and k4U high blood sugar levels | can ovarian cancer cause low blood sugar nlj | what is a 400 2gw blood sugar level | baseline 7yF blood sugar level | hypoglycemia low blood sugar reading TGG