షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు..

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో సహకార బ్యాంకు ఆధ్వర్యంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే పంప గోవర్ధన్ 32 లక్షల ప్రోసిడింగ్ కాపీని సొసైటీ అధ్యక్షులు భూమయ్యకు అందజేశారు. అనంతరం గోవర్ధన్ మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం జరుగుతుందని, ప్రభుత్వం సహకార వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, సొసైటీ ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షులు మల్లేశం, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు నరసింహులు, డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, నాయకులు సత్యం, సర్దార్ అలీ ఖాన్, తదితరులు ఉన్నారు.