నవతెలంగాణ- రేవల్లి
మండల కేంద్రంలో గడిచిన కొద్ది రోజులు నుండి గ్రామాలలో విస్తరంగా భారీ వర్షాలు కురుస్తున్నందున, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ పార్మర్లు వర్షాలకు తడిచి ఉంటాయి కాబట్టి ముట్టుకో రాదని సూచించారు, ప్రయాణికులు, రైతులు, వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అన్నారు, చెట్ల కింద ఉన్నప్పుడు కొమ్మలు విరిగే అవకాశాలు ఉంటాయి, ఉరుములు మెరుపులు మెరుస్తున్న టైం లో ఫోన్ ” స్విచ్ ఆఫ్ ” చేసి పెట్టాలని, ఈ వర్షాకాలం టైంలో చెరువులోకి చేపలు పట్టడానికి వెళ్లకండి వలలకు చుట్టుకొని చనిపోయే అవకాశాలు ఉంటాయని ” ఎస్సై శివకుమార్ ” తెలిపారు. ప్రయాణ సమయంలో రోడ్లు, వంతెనలు తెగిపోయిన రాకపోకలకు ఏదైనా ఆటంకాలు ఎదురైతే పోలీస్ అధికారులకు తెలుపాలని ( ఎస్సై ) కోరారు.