న్యూఢిల్లీ : మౌలికవసతులు, వస్త్రాలు, పైపులు తదితర రంగాల్లో ఉన్న వెల్స్పన్ కంపెనీ నూతన బ్రాండింగ్‌లో భాగంగా లోగోను మార్చుకున్నట్టు ప్రకటించింది. ఈ నూతన బ్రాండ్ గుర్తింపు అనేది తదుపరి స్థాయి అవకాశాలు,విలువ,అనుభవాలను అందించడానికి దోహ దం చేయనుందని పేర్కొంది.’ది ఎక్స్‌పోనెంట్’ అని నామ కరణం చేయబడిన కొత్త చిహ్నం చరిత్ర, భవిష్యత్తు రెండింటినీ సూచించడానికి ఆధునికీకరించిన వర్డ్‌మార్క్ చివ రిలో పైకి ఎత్తినట్టుగా రూపొందించబడిందని తెలిపింది.