
– ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ -తాడ్వాయి
విస్తృతంగా కురుస్తున్న వర్షాలకు, బీభత్సంగామారిన మేడారం ముంపు ప్రాంతాలను గురువారం ములుగు ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి పరిశీలించారు. ముంపుగురై ఆర్థికంగా నష్టపోయిన బాధ్యత కుటుంబాలను కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించారు. పస్రా -తాడ్వాయి మధ్యలో 163 వ జాతీయ రహదారిపై ఉన్న జలగలంచ బ్రిడ్జిని సందర్శించి పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం లేకుండా ఉన్నతాధికారులతో సహకరించాలని ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మేడారం పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ముంపు గురై నష్టపోయిన బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మేడారానికి వెచ్చించి, ఒక ప్లాన్, నియమ నిబంధన లేకుండా నిధులను నీళ్ళ పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చింతల వద్ద జంపన్న వాగు హై లెవెల్ బ్రిడ్జి, కొంగలమడుగు వద్ద ఐదు ఫీట్ల ఎత్తు తో కల్వర్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే ఊరటం బ్రిడ్జి కూడా నిర్మించాలని తెలిపారు. ఎన్ని వానలు కొట్టిన జంపన్న వాగు ముంపుకు గురి కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మండల గౌరవ అధ్యక్షులు జాలాపు అనంత రెడ్డి,
జిల్లా నాయకులు అర్రేం లచ్చు పటేల్, సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, వెంకన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

