వాగులు దాటి వైద్య శిబిరం..

నవతెలంగాణ -మంగపేట : వర్షాకాలం సీజనల్ వ్యాదుల నివారణకు ప్రభుత్వ వైద్యులు ఉద్రుతంగా ప్రవహిస్తున్న వాగులను సైతం దాటి గిరిజనులకు వైద్యం అందిస్తున్నారు. శుక్రవారం మండలంలోని చుంచుపల్లి ఆరోగ్య కేంద్రం వైద్యురాలు యమున ఆసుపత్రి పరిధిలోని శనిగకుంట గిరిజన గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామానికి మధ్యలో ఉద్రుతంగా ప్రవహిస్తున్ పెద్దఒర్రె దాటి గిరిజనులకు వైద్యం చేసి ఉచిత మందులు అందించారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గ్రామంలోని ప్రజలకు సీజనల్ వ్యాదులు రాకుండా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్బంగా గ్రామంలో ఇంటింటి ఫీవర్ సర్వే, మలేరియా పరీక్షలు, డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను నిర్వహించి ప్రజలందరికీ వర్షాకాలంలో వచ్చే వ్యాధులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించినట్లు యమున తెలిపారు. కార్యక్రమంలో హెచ్వీ ముత్తమ్మ, ఏన్ఎం సారమ్మ, ఆశ సుశీల పాల్గొన్నారు.