
– మేడారం పరిసర ప్రాంతాలను పరిశీలించిన కాంగ్రెస్ బృందం
నవతెలంగాణ- తాడ్వాయి
మండలంలో విస్తారంగా కురిసిన వర్షాలకు నష్టపోయిన బాధిత కుటుంబాలకు వరదసాహిక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విప్లమైందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్ విమర్శించారు. శుక్రవారం మండలంలోని ముంపు ప్రాంతాల వరద కోతకు గురై నా మేడారం పరిసర ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా బొల్లు దేవేందర్ మాట్లాడుతూ విపరీతంగా కురిసిన భారీ వర్షాలకు జంపన్న వాగు పొంగిపొర్లి మేడారం, ఉరటం, కాలపల్లి, కన్నెపల్లి, నార్లాపూర్, ఎల్బాక, పడిగాపూర్, కొత్తూరు, రెడ్డిగూడెం పలు గ్రామాలు బీభత్సం గా మారాయి అని అన్నారు. మేడారం దాని పరిసర గ్రామాలలో కోళ్లు కుక్కలు పాములు పశువులు మృతి చెంది తీవ్ర పారిశుధ్య లోపంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, మేడారంలో దుర్వాసన వెదజల్లుతుందని ఆయన ధ్వజమెత్తారు. గ్యాస్ కొట్టుకొని పోయి, కరెంటు లేక, త్రాగడానికి మంచినీరు లేక కనీసం చేతులు కడుక్కోడానికి కూడా నీరు లేదని వారు తిండి లేక ఆకలి కేకలతో దుర్భర జీవితం గడుపుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నదని ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్న మంత్రులు అధికార ఘనం ఇటు మేడారానికి వచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. జాతరప్పుడే అధికారులు ఉంటారని, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు ఆదివాసి గిరిజనులకు ప్రభుత్వం ఆదుకోదా అని మండిపడ్డారు. రాజకీయం చేయాలంటే ఎన్నికల అప్పుడు చేయాలని ? పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు రాజకీయం చేసుడు ఏందని అన్నారు. రేపటి పది గంటల వరకు మేడారంలో వివిధ శాఖల అధికారులతో పారిశుద్ధ్యం విద్యుత్ నీటిపారుదల పంచాయతీరాజ్ వైద్య మరియు వివిధ శాఖల అధికారులతో కనీస సౌకర్యాలు మేడారం పరిసర ప్రాంతాల ప్రజలకు అందించకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టెంట్ వేసుకొని నిరాహారదీక్షకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మేడారం ప్రజలు ధన, ప్రాణ నష్టాలకు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. మంచినీరు లేక కూడా నాన్న ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. రేపటికల్లా ప్రాథమిక సౌకర్యాలు మేడారం దాని పరిసర ముంపు ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టాలని వారి డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తామని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, గౌరవ అధ్యక్షులు జాలపు అనంతరెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జిల్లా నాయకుడు అర్రెం లచ్చు పటేల్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పీరీల వెంకన్న, డైరెక్టర్ రంగరబోయిన జగన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.