రేవంత్‌ యాత్రకు విరామం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర’కు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి విరామమిచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని (18,19 తేదీల్లో) ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 6న ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం నుంచి ప్రారంభమైన యాత్ర…11రోజులపాటు కొనసాగుతూ శుక్రవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి చేరుకుంది. మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వంద కిలోమీటర్లు నడిచారు. విరామానంతరం ఈనెల 20 నుంచి వరంగల్‌ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల మీదుగా యాత్ర తిరిగి కొనసాగనుంది.