ఔట్ సోర్సింగ్ ఏఈవోలను రెగ్యులరైజ్ చేయాలని ఎమ్మెలే కు వినతి పత్రం

– జుక్కల్ మండల ఔట్ సోర్సింగ్ ఏఈవోల సంఘం
నవతెలంగాణ – జుక్కల్
మండలంలో వ్వవసాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఏఈవోల సంఘం సబ్యులు శనివారం నాడు పిట్లం మండలంలోని మార్కేట్ కమిటి కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెలే హన్మంత్ షిండేను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సంధర్భంగా జుక్కల్ మండల ఏఈవో సంఘం నాయకులు ప్రియాంక, విజయ మాట్లాడుతు చాలా కాలంగా ఔట్ సోర్సింగ్ లో ఏఈవోలుగా వ్వవసాయశాఖలో విధులు నిర్వహిస్తున్న తమకు రెగ్యులర్ చేసి పీఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం కల్పించే విధంగా ప్రభూత్వం మరియు, ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరింప చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో  జుక్కల్ మండల ఔట్ సోర్సింగ్ ఏఈవోలు తదితరులు పాల్గోన్నారు.