పవర్‌ఫుల్‌ రామబాణం

గోపీచంద్‌, శ్రీవాస్‌ కాంబోలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్‌ హిట్ల తర్వాత వస్తున్న హ్యాట్రిక్‌ సినిమా ‘రామబాణం’. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్‌ సరసన నాయికగా డింపుల్‌ హయతి నటిస్తుండగా జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విక్కీ అనే పవర్‌ ఫుల్‌ పాత్రలో గోపీచంద్‌ కనిపించనున్నారు. మహా శివరాత్రి కానుకగా శనివారం సాయంత్రం మేకర్స్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేశారు. ‘విక్కీస్‌ ఫస్ట్‌ యారో’ పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియో అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. మిక్కీ జే మేయర్‌ అందించిన నేపథ్య సంగీతం మెప్పించింది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారు. గోపీచంద్‌ 30వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేతలు వ్యయానికి వెనకాడకుండా ప్రముఖ నటీనటులు, ఉత్తమ సాంకేతిక నిపుణులతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.