ఏంజెల్‌ వన్‌ ‘స్మార్ట్‌ ఇన్వెస్టింగ్‌ సూపర్‌ యాప్‌’ ఆవిష్కరణ

న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌ కొత్తగా స్మార్ట్‌ ఇన్వెస్టింగ్‌ సూపర్‌ యాప్‌ను ఆవిష్కరి ంచినట్లు వెల్లడించింది. ఇది ఇన్వెస్టర్ల సంపద సృష్టి ప్రయాణంలో డేటా, సాంకేతికత శక్తిని ప్రభావితం చేయడానికి మద్దతును ఇవ్వనుందని పేర్కొంది. వేగం, భద్రత, నమ్మదగిన అనుభవం లక్షణాలను కలిగి ఉందని తెలిపింది. సూపర్‌ యాప్‌ కస్టమర్‌ సెంట్రిసిటీని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిందని తెలిపింది.