సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉంది..

– జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనదే
నవతెలంగాణ -కంటేశ్వర్
మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్& తెలంగాణ ఆల్ పెన్షనర్స అసోసియేషన్ ఆధ్వర్యంలో నాందేవ్ వాడలోని ట్రస్టు భవనంలో మహిళల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపు ను (ఆరోగ్య శిబిరాన్ని) మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ప్రముఖ గైనకాలజిస్టులు డాక్టర్ కే. పార్వతి డాక్టర్ సుజాత ఫిజీషియన్ డాక్టర్ సూరి పాల్గొన్నారు. మహిళలు రక్తహీనతతో, పోషకాహార లోపాలతో ఉన్నారని, మహిళలు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు కానీ తన గురించి పట్టించుకోరని, ఇది మంచిది కాదని, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేస్తే క్యాన్సర్ లాంటి ప్రమాదకర వ్యాధులకు లోనవుతున్నారనీ డాక్టర్ పార్వతి అన్నారు. జ్వరం దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇతర సీజనల్ వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని, వీటి పట్ల అప్రమత్తతతో ఉండాలని డాక్టర్ సుజాత అన్నారు. దాదాపుగా 64 మంది మహిళలు ఈ క్యాంపులో పాల్గొన్నారు. ఈ క్యాంపు నిర్వహణలో ట్రస్టు కార్యదర్శి కే. రామ్మోహన్రావు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, ట్రేడ్ యూనియన్ నాయకులు నూర్జహాన్, రమేష్ బాబు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రామ్మోహన్రావు జన విజ్ఞాన వేదిక బాధ్యులు నర్రా రామారావు, ప్రసాద్ రావు, నర్సింలు శిబిరాన్ని పరిశీలించారు. ఇంకా ఈ హెల్త్ క్యాంపులో ఎం గోవర్ధన్, సిర్ప లింగయ్య తదితరులు పాల్గొన్నారు.