పంచాయతి కార్మికుల సమ్మె..

నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు మండల గ్రామ పంచాయతీ కార్మికులు మంగళవారం సమ్మె చేసి ఎంపీడీఓ క్రాంతి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల గ్రామ పంచాయతిలలో పని చేయుచున్న కాంబర్, వాటర్ మెన్, ఎలక్ట్రిషన్, సఫాయిలు చాలిచాలని జీతములతో విధులు నిర్వహిస్తున్నామని, గత కొంత కాలముగ కార్మికుల సమస్యల పై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా గానీ ఎలాంటి స్పందన లేకుంద నిర్లక్ష్య ముంగ వ్యవహరిస్తు కాలయాపన చేస్తుందన్నారు, ఇందువల్ల మేము సమస్యల సాధన కోరకు సమ్మెకు వెల్లుచున్నామన్నారు. దయచేసి మా యొక్క సమస్యలను మీ ద్వారా ప్రభుత్వముకు విన్నవించుటకు మనవి చేయుచు మేము చేయబోవు సమ్మెకు తమరి మద్దతు కోరుతుసమా చార నిమిత్తము తేలియ పరుచుచున్నాము. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి రంజిత్ గౌడ్, ప్రచార కార్యదర్శి శివ రామక్రిష్ణ డి. శ్రావణ్, కార్యవర్గ సభ్యులు మిన్ కుమార్, యు.సుదర్శన్, లక్ష్మీపతి, బాలయ్య, శ్రీపాల్, తదితరులు పాల్గొన్నారు.