పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి

నవతెలంగాణ-  మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న తడ్గుర్ గ్రామ శివారు ప్రాంతాన్ని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి సందర్శించారు వానాకాలం పంటలైన  పత్తి,  సోయాబీన్ పెసర, మినుము కంది పంటలను మంగళవారం నాడు పరిశీలించడం జరిగింది. పత్తి పంటలలో రసం పీల్చే పురుగులైన తెల్ల దోమ, పచ్చదోమ, తామర పురుగు గమనించడం జరిగింది. దీని నివారణకు అసెటమిప్రిడ్ 50గ్రాములు ఎకరాకు లేదా తయమే తక్సమ్ 50గ్రాములు ఎకరాకు పిచకరి చేయాలని సూచించారు. అదేవిధంగా సోయాబీన్ పంటలో  యెల్లో మోసైక్ వైరస్ వై ఎన్ వి గమనించి నివారణకు  ఫ్లోనాకామిడ్ రెండు ఎమ్ ఎల్ నీటికి లేదా అసటాపి ప్రైడ్ 50గ్రాములు ఎకరాకు పిచకారి చేయాలని సూచించారు. ఫాస్పరస్ సోలుబిలైజింగ్ పిఎస్ బి వాడకం గురించి రైతులకు వివరించారు. పి ఎస్ బి భూమిలో వున్న కరగని భాస్వరం ను కరిగే విధంగా మార్చి మొక్కకు అందిస్తుంది.దీని వలన ఫాస్పరస్ ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చని వివరించారు.అదేవిధంగా కలుపు మందుల వాడకం గురించి రైతులకు వివరించారు. అధిక వర్షాల వలన పంటలో ఎదుగుదల తగ్గినట్లయితే 19.19.19(పాలిఫీడ్) ఎకరాకు 1కేజీ లేదా 19.0.45 (మల్టీ K) ఎకరాకు 1కేజీ పిచకారి చేయాలని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డి ఎ వో భాగ్యలక్ష్మి సతీష్ చిద్రావర్,గ్రామ రైతు బంధు సమితి అధ్యక్షులు శంకర్ పటేల్,రైతులు  నగుల్గావే పాండురంగ పటేల్,ఇసంవర్ శివాజీ, దిగంబర్, లుటే దిలీప్ తదితరులు పాల్గొన్నారు.