ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. కేసు నమోదు

నవతెలంగాణ-ఊరుకొండ
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఊరుకొండ ఎస్సై లెనిన్ తెలిపారు. ఎస్సై తెలిపిన విరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున కల్వకుర్తి వైపు నుండి ఊరుకొండ వైపుకు నెంబర్ ప్లేట్ లేని సోనాలిక ట్రాక్టర్ లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వంగూరు మండలం మిట్టసదగోడు గ్రామానికి చెందిన గున్నమోని అఖిల్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మిట్ట సదగోడు గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నానని అఖిల్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఏలాంటి అనుమతులు లేకుండా.. ట్రాక్టర్ సంబంధించిన పేపర్లు సైతం లేకపోవడంతో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకని తరలిస్తే చెట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై లెనిన్ తెలిపారు.