నవతెలంగాణ-కోహెడ
కోహెడ మండల కేంద్రానికి 108 అంబులెన్స్‌ను కేటాయించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు జాలిగం శంకర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్‌ల సహాకారంతో కోహెడ మండల కేంద్రానికి 108 వచ్చిందన్నారు. అలాగే అత్యవసర పరిస్థితులలో ప్రాణాలు కాపాడేందుకు సమీప కేంద్రంలోనే ఉండడం సంతోషకరమన్నారు. అలాగే ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్, ఫ్యాక్స్ ఛైర్మన్ పేర్యాల దెవేందర్‌రావు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పేర్యాల నవ్య దేవెందర్రావులు మంత్రి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ తిప్పారపు నాగరాజు, పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు వేల్పుల శంకర్, ఏఎంసీి డైరెక్టర్ ముంజ సంపత్, నారాయణపూర్ గ్రామ సర్పంచ్ కనకయ్య, సోషల్ మీడియా నాయకుడు వజ్జపల్లి శ్రీనివాస్, ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు ముంజ రమేష్, పెసరు సుధాకర్, జాలిగం రాజు, వేముల రమేష్, ఆరే జగదీష్, నాయకులు తిప్పరవేని భాస్కర్, బస్వరాజు రాజశేఖర్, పేర్యాల సంపత్‌రావు, తాడెం మహేష్, రమేష్, ముడికె మహేష్, ఉల్లెంగుల నరేష్, రేవోజు రాజు, శ్రీకాంత్, యాద అశోక్, తదితరులు పాల్గోన్నారు.