నవతెలంగాణ-తాడ్వాయి: వరద బాధిత కుటుంబాలకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు, టార్ఫలిన్ పరదాలు అందజేత మృతుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్గ్రేషియా అందించాలి. ములుగు ఎమ్మెల్యే సీతక్క ఇటీవల విస్తృతంగా కురిసిన భారీ వర్షాలకు జంపన్న వాగు అభివృద్ధికి కొట్టుకపోయి, నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాలకు బుధవారం మండలంలోని వెంగలపూర్, కాల్వపల్లి, ఊరట్టం, మేడారం, గోనెపల్లి, గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టునగర్, పసర, నేతాజీనగర్, ఫ్రూట్ ఫారం గ్రామాలలో ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, అఖండ భారత యూత్ ఆర్గనైజేషన్, నిహారిక ఫౌండేషన్, హైదరాబాద్ ఐటి ఉద్యోగుల సహాయ సహకారాలతో 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, తార్ఫలిన్ పరదాలు అందజేశారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వరదల వలన ప్రాణాలు కోల్పోతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫాంహౌస్ లో ఉంటు, కనీసం పట్టించుకోకపోవడం సిగ్గు చేటు అని అన్నారు. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారు ముందుగా హెచ్చరించిన కూడా ముందస్తు చర్యలు చేపట్టకుండా ఇంత నష్టానికి పరోక్షముగా కారకులయ్యారు అని మండిపడ్డారు. ములుగు నియోజకవర్గంలో నేను స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా వరద బాధితులకు కనీస అవసరాలను తీరుస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అని, కానీ మీరు మాత్రం కనీసంగా వరదల గురించి మాట్లాడకుండా ఉండడం విడ్డూరంగా ఉందని, వరదల్లో చిక్కుకుని మృతి చెందిన కుటుంబాలకు వెంటనే 5లక్షల రూపాయలు, ఇండ్లు కోల్పోయి సర్వస్వం కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి, వంట సామాగ్రి కొరకు లక్ష రూపాయల సహాయం, నీట మునిగిన ఇండ్లకు లక్ష రూపాయల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల పొలాల్లో ఇసుక మేటలు పెట్టి పంటలు దెబ్బతిన్న రైతు కుటుంబాలకు, ఎకరానికి 30,000/- రూపాయల తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. వరదల్లో కొట్టుకుపోయి మరణించిన మృతుల కుటంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, ఎస్.సి. సెల్ జిల్లా దాసరి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ తాడ్వాయి మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, గౌరవ అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి, సహకార సంఘ అధ్యక్షులు పన్నాల ఎల్లారెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు యాశాడపు మల్లయ్య, తాడ్వాయి సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, జిల్లా నాయకులు అర్రెం లచ్చు పటేల్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేవంత్, నాయకులు వంశీ కృష్ణ, అశోక్, తిరుపతి, రవి, కృష్ణ, రాంబాబు, చింత రంగయ్య, పాక రాజేందర్, సిద్దబోయిన శ్రీనివాస్, పంగ శ్రీను, సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.