
– ఇతర సమస్యలను పరిష్కరించకుంటే సమ్మె బాట
– తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ
నవతెలంగాణ- కంటేశ్వర్
వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఎన్ఏహెచ్ లను రెగ్యులర్ చేయాలని నోటిఫికేషన్ 2/2023 క్యాన్సల్ చేయాలని ఇతర సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెబాట ఉంటుందని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిఎంహెచ్ఓకి సమ్మె నోటీసు అందజేశారు. సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిహెచ్ఎ(ఎఫ్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ 2/2023ను జారీ చేసింది. 1,520 పోస్టుల భర్తీ చేయబోతున్నది. ఈ రిక్రూట్మెంట్ కోసం పరీక్ష నిర్వహించి సెలక్ట్ చేయబోతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పరీక్ష రాసి, మెరిట్ వస్తే సెలక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సర్వీసుకు 20 మార్కులు వెయిటేజి ఇచ్చినా ప్రయోజనం ఉందదు. గత 20 సం||లుగా వీరు పని చేస్తున్నారు. గతంలో వీరంతా డిఎస్సి ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం ఎంపికై పని చేస్తున్నారు. మళ్ళీ పరీక్ష రాయమనడం. న్యాయం కాదు. ఇప్పటికే చాలా మందికి ఏజ్ బార్ అయింది. వీరిని ఖాళీ పోస్టులలో సీనియారిటీ ప్రకారం రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని కోరుతున్నాము. అలాగే జీతభత్యాలు, ఇతర సమస్యలు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆగస్ట్ 15 నుండి కాంట్రాక్ట్ ఎంపిహెచ్ఎ(ఎఫ్) అందరూ సమ్మెలోకి వెళ్తారని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి పుష్ప , యూనియన్ నాయకులు కవిత జ్యోతి వనిత రజిత ర్లు పాల్గొన్నారు.