కల్వర్ట్ నిర్మాణ నిర్లక్యంపై ఎంపీడీఓకు వినతిపత్రం..

నవతెలంగాణ-బెజ్జంకి 
గుత్తేదారు నిర్లక్ష్యంగా వల్ల ఇటీవల కురిసిన వర్షాల వల్ల సంభవించిన వరద ఉదృతికి మండల పరిధిలోని లక్ష్మీపూర్ -ఎల్లంపల్లి గ్రామాల మద్య  రోడ్డు కొట్టుకుపోయి ప్రజల రాకపోకలు నిలిచిపోయాయని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి ఆరోపించారు. సంబంధిత గుత్తేదారుతో త్వరితగతిన కల్వర్ట్ నిర్మాణం చేపట్టి ప్రజల రాకపోకలను పునరుద్దరించేల సత్వర చర్యలు తీసుకోవాలని బుధవారం మండల కేంద్రంలో ఎంపీడీఓ రాముకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రమందజేశారు.మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.