అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. సమ్మర్లో సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్న మేకర్స్ బుధవారం టీజర్‌ను విడుదల చేసి, ప్రమోషన్స్‌ను ప్రారంభించారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాగ చైతన్య టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ,”ఉగ్రం’ టీజర్ చూసిన వెంటనే అదిరిపోయిందనిపించింది. నరేష్‌ని చూసి స్టన్ అయిపోయాను. ‘నాంది’ తర్వాత నరేష్ మళ్ళీ అలాంటి ఇంటెన్స్ రోల్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘అల్లరి’తో మొదలుపెట్టి ఈ రోజు ‘ఉగ్రం’తో వస్తున్నారు. ఇదొక అద్భుతమైన ప్రయాణం. ఆయనకి అభినందనలు. విజరు, నరేష్ కాంబినేషన్ ఒక బ్రాండ్లా పడిపోయింది. ఈ టీజర్ చూస్తే నెక్స్ట్ లెవల్ అనిపించింది. వీరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రావాలి. అన్ని డిపార్ట్మెంట్స్ అద్భుతంగా పని చేశారు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలి’ అని చెప్పారు. ‘ఒక నటుడిని దర్శకుడు ఎంత నమ్మితే అన్ని మంచి విజయాలు వస్తాయి. మా నాన్నగారు నన్ను నమ్మినపుడు వరుస విజయాలు వచ్చాయి. క్రిష్ నమ్మినపుడు గమ్యం, సముద్రఖని నమ్మినపుడు శంభో శివ శంభో.. ఇలా మంచి సినిమాలు వచ్చాయి. దీని తర్వాత ‘నాంది’తో విజరు నాకు కొత్త రూటు చూపించారు. మా కాంబినేషన్లో సినిమాలు వస్తూనే ఉంటాయి’ అని హీరో అల్లరి నరేష్ చెప్పారు. ‘మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చే సినిమా, ఆనందం ఇచ్చే సినిమా, కోపం తెప్పించే సినిమా’ అని రచయిత అబ్బూరి రవి తెలిపారు.