రుణమాఫీ చేసినందుకు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

నవతెలంగాణ-భిక్కనూర్
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నందుకు గురువారం మండల బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చిత్రపటాలకు భిక్కనూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పదని, రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రారంభించి రుణమాఫీ చేసినందుకు రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, జడ్పిటిసి పద్మ నాగభూషణం గౌడ్, వైస్ ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లేశం, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సాయి రెడ్డి, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ కిష్టా గౌడ్, సిద్ధ రాములు, సొసైటీ చైర్మన్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.