మెగా మల్టీస్టారర్‌ మొదలైంది

టాలీవుడ్‌లో ఓ క్రేజీ మెగా మల్టీస్టారర్‌ ప్రాజెక్ట్‌ స్టార్ట్‌ అయ్యింది. దీంతో మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. పవన్‌కళ్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాని దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదాయ సిద్ధం’ చిత్రానికి రీమేక్‌గా ఈ ప్రాజెక్ట్‌ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర షూటింగ్‌లో పవన్‌కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను ఆరంభించారు.