సీఎం కేసీఆర్ కు పాలభిషేకం

నవతెలంగాణ- రాజంపేట్: రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మండలంలోని ఆరెపల్లి గ్రామంలో సీఎం కెసిఆర్ చిత్రపటానికి గురువారం బీఆర్ఎస్ నాయకులు పాలభిషేకం నిర్వహించారు.  ఈ సందర్భంగా బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు బిక్కాజి బలవంతరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని ఎప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచిస్తాడని ఆయన తెలియజేశారు.  సీఎం కేసీఆర్ రుణమాఫీ ప్రకటన చేయడంతో గ్రామాల్లో ప్రజలు ఆనందోత్సవాలతో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము యాదగిరి సీనియర్ నాయకులు మాలిస్ కమలాకర్ రావు ,గ్రామ పార్టీ అధ్యక్షులు  చెవుల మాణిక్యం, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి లచ్చవోళ్ళ నరేష్,సొసైటీ డైరెక్టర్ రామ్ సింగ్,వార్డ్ మెంబర్ చెవుల సంతోష్ ,వార్డ్ మెంబర్  రవీందర్,బిక్కాజి భూంరావ్,పోలీస్ రాజేంద్ర రావు,బిక్కాజి భాస్కరరావు, రెస్మాయి వెంకట్రావు, రెస్మాయి భాస్కర్ రావు,గడ్డమీది రాజు,చాకలి శ్యామయ్య,  చాకలి లక్ష్మణ్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.