
నవతెలంగాణ-గోవిందరావుపేట
ఉపాధ్యాయులు విద్యార్థులకు ఘనాత్మక విద్యను అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పానిణి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఫౌండేషనల్ లీడర్స్ అండ్ న్యూమరసి శిక్షణ శిబిరాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి పానిణి హాజరై మాట్లాడారు.
మండలంలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు తేదీ 2.8.2023 నుండి 8.8.2023 వరకు మూడు విడతల్లో శిక్షణ ఇవ్వబడుతుంది.మొదటి విడతలో తెలుగు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ జరుగుచున్నదన్నారు.విద్యార్థులకు ప్రభుత్వం గుణాత్మక విద్య ను అందించాలనే లక్ష్యంతో ఈ శిక్షణను అందిచుచున్నామని విద్యార్థులకు చదవడం రాయడం విషయాలను అవగాహన చేసుకోవడం కోసం ప్రభుత్వం ఉచితంగా వర్క్ బుక్స్ పంపిణీ చేసిందని చెప్పబడే పాఠ్యాంశాల ఆధారంగా విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారం తో వర్క్ బుక్స్ సొంతం గా రాసేలా కృత్యాలు స్వతహాగా చేయాలని అన్నారు.శిక్షణను ఉపాద్యాయులు సద్వినియోగం చేసుకొని పూర్తిగా సంసిద్దులై పాఠశాలలకు వెళ్ళాలని కోరారు. శిక్షణలో తెలుసుకున్న విషయాలను కొంతమంది ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణలో కోర్సు కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న మండల విద్యాశాఖాధికారి కొన్ని దివాకర్ వ్యవహరిస్తున్నారు.పర్యవేక్షణ అధికారి గా శ్రీ K. రాజేశ్వర రావు ప్రధానోపాధ్యాయులు చెల్లాయి వ్యవహరిస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డి ఆర్ పి గా ఉన్న శ్రీ రంగం ఆర్ పి లు గా డి.దిలీప్,దిలీప్ లు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాద్యాయులు ఎం ఆర్ సి సిబ్బంది విష్ణు , భిక్షపతి, చందు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.