విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలు అందజేత..

నవతెలంగాణ- రాజంపేట్
విద్యార్థులు ఆరోగ్య సమస్యలు లేకుండా 18 సంవత్సరాల లోపు వయసులో గల  మండలంలోని అన్ని పాఠశాల విద్యార్థులకు గురువారం నులిపురుగు నివారణ మాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా రాజంపేట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ విజయ మహాలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు కలగ కాకుండా ప్రతి సంవత్సరం ప్రభుత్వం రెండుసార్లు నులిపురుగు మాత్రలను  అందజేస్తున్నట్టు ఆమె తెలిపారు. అనంతరం ఆర్ బి ఎస్ కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సృజన వ్యాధుల పట్ల,  ప్రస్తుతం వస్తున్నటువంటి కండ్లకల వ్యాధి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి,  విద్యార్థులు తీసుకోవాల్సిన  ఆహారం గురించి ఇతర అంశాలపై అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే డాక్టర్ దివ్యభారతి, ఏఎన్ఎం స్వప్న,నీరజ,సూపర్వైజర్ గంగమణి తదితరులు పాల్గొన్నారు.