శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయగౌడ్‌ కుటుంబానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరామర్శ

నవతెలంగాణ -హైదరాబాద్‌
శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయగౌడ్‌ కుటుంబాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరామర్శించారు. ఇటీవల ఆంజనేయగౌడ్‌ సోదరుడు నర్సన్‌ గౌడ్‌ మృతిచెందిన విషయం విదితమే. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆలూరులో నర్సన్‌గౌడ్‌ దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరై వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు ఆలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్‌ సాయిచంద్‌, వినియోగదారుల ఫోరం చైర్మెన్‌ గట్టు తిమ్మప్ప, జడ్పీచైర్‌పర్సన్‌ సరిత తిరుపతయ్య, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా జెడ్పీ మాజీ చైర్మెన్‌ బండారు భాస్కర్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు హనుమంతనాయుడు, వడ్డేపల్లి జెడ్పీటీసీ కాసపోగు రాజు, వైస్‌ఎంపీపీ చంద్రన్నగౌడ్‌, ఎంపీటీసీ వెంకటన్న గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.