2023 – 2025 సంవత్సరాలకు సంబంధించి తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఎన్నికలు ఇటీవల జరిగాయి. ఈ ఎన్నికలలో గెలుపొందిన అధ్యక్షులు యస్.ఎ.ఖుద్దూస్, ప్రధాన కార్యదర్శి డా.జోశ్యభట్ల, కోశాధికారి బి. ఉదరు కుమార్‌తోపాటు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహౌత్సవం శుక్రవారం ఫిలింఛాంబర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎఫ్డిసి చైర్మన్ అనిల్ కుర్మాచలం, నిర్మాతల మండలి కోశాధికారి టి.ప్రసన్నకుమార్, దర్శకులు వై.వి.ఎస్. చౌదరి, టెలివిజన్ వర్కర్స్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నాగబాల సురేష్ అలాగే టెలివిజన్ వర్కర్స్ ఫెడరేషన్లో ఉన్న అన్ని సంఘాల పిఎస్టీలు పాల్గొన్నారు.