హైదరాబాద్ అంగన్వాడి సమావేశానికి తరలి వెళ్లిన కార్యకర్తలు

నవతెలంగాణ- కంటేశ్వర్

అంగన్వాడి సమస్యలపై చర్చించటానికి రాష్ట్ర కేంద్రంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగే సదస్సుకు జిల్లా నుండి అంగన్వాడీ కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లడం జరిగింది. అని అంగన్వాడి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు అనేక విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందజేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్నప్పటికీ వారి సమస్యలను పరిష్కరించటంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన రీతిలో స్పందించకపో వడంతో సమస్యలపై చర్చించుకుని కార్యాచరణ రూపొందించుకోవటానికి ఈరోజు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును నిర్వహించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన నిర్ణయంలో భాగంగా జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల నుండి అంగన్వాడీ నాయకులు తరలి వెళ్లడం జరిగింది. ప్రధానంగా కనీస వేతనాలు అమలు జరపాలని అంగన్వాడీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు టీచర్లకు మూడు లక్షల ఆయాలకు చెల్లించాలని పెన్షన్ సౌకర్యాన్ని అమలు జరపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని నూతన జాతీ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవటానికి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ నీ ప్రభుత్వ పరం చేయటంతో పాటు వీఆర్ఏలను రెగ్యులర్ చేయడం జరిగిందని కాంట్రాక్ట్ వర్కర్లను క్రమబద్ధరించడం జరుగుతుందని అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నం చేయడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే పరిష్కరించని ఎడల ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు కే దేవగంగు జిల్లా ప్రధాన కార్యదర్శి పి స్వర్ణ కోశాధికారి చంద్రకళ జిల్లా నాయకులు సూర్య కళ ,శివరాజమ్మ ఎలిజిబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు.