
నవతెలంగాణ – డిచ్ పల్లి
అత్హాంగ్ టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ అధ్వర్యంలో ఇందల్ వాయి మండలంలోని గన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద 30 బెంచీలను అందజేసినట్లు మండల విద్యాశాఖాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా మండల విద్యాశాఖాధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలాలకు డుయిల్ బెంచిలను అందజేయడం అభినందనమని, పాఠశాలలో విద్యా నభ్యసించే విద్యార్థులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని అయన పేర్కొన్నారు. వారిని అభినందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు వీరలక్ష్మి, పాఠశాల సిబ్బంది, సిఆర్పి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.