
సిద్దిపేట అర్బన్ మండల పరిధిలోనీ వెల్కటూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులకు అమెరికా లోని ఒక్లహొమా రాష్ట్రానికి చెందిన శాంత కుమారి, మణిరాజు దంపతులు దాదాపు ఇరవై వేల రూపాయలు విలువ చేసే ఫార్మేటివ్ అసెస్మెంట్ నోట్ బుక్ లు పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముండ్రాతి రమేష్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్దులకు ఈ విధంగా సహాయ, సహకారాలు అందించడం అభినందనీయమని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేందర్, ఆంజనేయులు, మల్లేశం, ఆనందం, మంజుల, లావణ్య, భవాని పాల్గొన్నారు.