మహాంతంలో పిచ్చికుక్క దాడి..

నవతెలంగాణ-నవీపేట్: మండలంలోని మహంతం గ్రామంలో పిచ్చికుక్క ముగ్గురు పిల్లలతో పాటు పశువులపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు పిల్లలు నీరడీ కార్తికేయ, మెట్టు వైష్ణవి, మెట్టు సుజాత లను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. గ్రామంలో పిచ్చికుక్కల బెడద తీవ్రం కావడంతో నివారించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.