నవతెలంగాణ – ఆళ్ళపల్లి: మండల పరిధిలోని ముత్తాపురం గ్రామానికి చెందిన చాట్ల బుచ్చయ్య ఇటీవల కాలంలో కిన్నెరసాని వాగు ఉధృతిలో కొట్టుకుపోయిన నేపథ్యంలో కరకగూడెం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆశావహులు పోలెబోయిన శ్రీవాణి ఆదివారం మృతుడి ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు స్థానిక మండల కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా ఆర్ధిక సహాయం అందించారు. ఇటీవల అధిక వర్షాలకు కిన్నెరసాని వరద ముంపుకు గురైన రాయిపాడు, ముత్తాపురం గ్రామాల్లోని ఇండ్లకు చేరుకుని, వారికి ఇతోధిక సహాయం, వంట సరుకులు అందించారు. అనంతరం మండలంలో పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటించి సమస్యలను, ప్రజల బాగోగులను అడిగితెలుసుకున్నారు. రానున్న కాలంలో నిరుపేదలకు అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాయం రామనర్సయ్య, అనంతోగు సర్పంచ్ గలిగె సమ్మక్క, నాయకులు పెండకట్ల నాగేశ్వరావు, గంగిరెడ్డి బ్రదర్స్, తూపూడి శ్రీనివాస్, కేతమల్ల రమణ, గట్ల శ్రీనివాసరెడ్డి, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.