యూనిక్‌ కాన్సెప్ట్‌

సోహైల్‌, రూపా కొడవయూర్‌ జంటగా మైక్‌ మూవీస్‌ బ్యానర్‌ పై అప్పిరెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ ప్రెగెంట్‌’. శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మిస్టర్‌ ప్రెగెంట్‌ అనగానే మగవాళ్లు ప్రెగెంట్‌ ఎలా అవుతారు?, అది సినిమాలో ఎలా చూపించారు అనే ఆసక్తి కలిగింది. ట్రైలర్‌ చాలా బాగుంది. ట్రైలర్‌ చూశాక సినిమా చూడాలనే ఆసక్తి ఏర్పడింది. అలాగే ట్రైలర్‌ ఎమోషనల్‌గా ఉంది. దర్శకుడు శ్రీనివాస్‌కు ఇది ఫస్ట్‌ మూవీ. ఆయనే స్క్రిప్ట్‌ రాశాడు. డిఫికల్ట్‌ సబ్జెక్ట్‌ ఇది. బాగా తెరకెక్కించాడని అర్థమవుతోంది. ఈ సినిమా టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’ అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘ఈ సినిమా కొత్తగా ఉంటుంది, యూనిక్‌ కాన్సెప్ట్‌తో చేశాం’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ, ‘ఈ కథ చెప్పినప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్‌ యాక్సెప్ట్‌ చేసేందుకు భయపడ్డారు. కానీ అప్పిరెడ్డి, రవిరెడ్డి, వెంకట్‌ ఈ కథను నమ్మి..చేస్తే ఇలాంటి డిఫరెంట్‌ మూవీనే చేయాలని ఈ సినిమా చేశారు’ అని తెలిపారు. ‘చాలా మంచి మూవీ. ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రెండూ ఉంటాయి. ఈ సినిమా చూశాక ఇంటికి వెళ్లి అమ్మను హగ్‌ చేసుకుంటారు’ అని హీరో సోహైల్‌ చెప్పారు.