కులవివక్షకు నిదర్శనమే ప్రీతి ఆత్మహత్య ఘటన : కేఎన్‌వీ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మెడికల్‌ కాలేజీల్లో పేట్రేగిపోతున్న కులవివక్షకు నిదర్శనమే ధరావత్‌ ప్రీతి ఆత్మహత్య ఘటన అని కుల నిర్మూలన వేదిక (కేఎన్‌వీ) రాష్ట్ర అధ్యక్షులు పాపని నాగరాజు, ప్రధాన కార్యదర్శి కోట ఆనంద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడికల్‌, ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ పేరుతో అమలవుతున్న కులవివక్షను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ర్యాగింగ్‌, కులవివక్షపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థల్లో కులవివక్షను రూపుమాపేందుకు రోహిత్‌ చట్టాన్ని తేవాలని కోరారు.