సింధు వరల్డ్‌ నం.15 డబ్ల్యూబిఎఫ్‌ ర్యాంకింగ్స్‌

Sindhu World No.15 in the WBF Rankingsన్యూఢిల్లీ : ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పి.వి సింధు రెండు స్థానాలు మెరుగైంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరిన సింధు రెండు స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచింది. కిదాంబి శ్రీకాంత్‌ మాత్రం 20వ స్థానంలోనే నిలిచాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌కు చేరిన హెచ్‌.ఎస్‌ ప్రణరు, యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ మెన్స్‌ సింగిల్స్‌లో వరుసగా 9, 11వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ప్రియాన్షు రజావత్‌ మూడు స్థానాలు మెరుగై 28వ స్థానంలో, మిథున్‌ మంజునాథ్‌, కిరణ్‌ జార్జ్‌లు 43, 49వ స్థానాల్లో నిలిచారు. మెన్స్‌ డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ రెండో స్థానం నిలుపుకుంది. ట్రెసా జాలీ, గాయత్రి జంట మహిళల డబుల్స్‌లో 19వ స్థానానికి పడిపోయింది.