
తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలి అని స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఎస్ టి యు భవాని లో జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ..జూలై 2023 నుంచి కొత్త వేతనాలు తీసుకోవాల్సి ఉండగా ప్రభుత్వం ఇంత వరకు పి ఆర్ సి కమిటీని వేయకపోవడం శోచనీయమని,ఇప్పటికైనా పి ఆర్ సి కమిటీని నియమించి,తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలి అని,ఆగస్ట్ నెల వేతనాలతో మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని తెలియజేశారు. సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకరాలకు అనుగుణంగా 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టులను నింపుతూ,పండిట్ పీఈటి పోస్టులను అప్ గ్రేడ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ మాట్లాడుతూ..317 జీఓతో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని, జీవో వల్ల తలెత్తే ఇబ్బందుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవతీసుకొని వారికి న్యాయం చేయాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలిఅని అన్నారు .రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి అని, కేజీబీవీ ఉపాధ్యాయులకు టైం స్కేల్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాలి అని కోరారు. రాష్ట్ర కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. పాఠశాలలో పారిశుధ్య కార్మికులను నియమించాలి అని,విద్య వాలంటీర్స్ ను నియమించి విద్యావ్యవస్థను పటిష్టం చేయమని,ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది కావున వెంటనే తగు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్,జిల్లా ఆర్ధిక కార్యదర్శి అఫ్జల్ బెగ్ జిల్లా బాధ్యులు బాలచంద్రం ,మహేశ్వర్, ,శ్రీనివాస్,యాదగిరి,మల్లయ్య,గంగకిషన్, కాంత రావు,వెంకటేశ్వరరావు, సురేందర్,రత్నాకర్,సాయిబాబా,సనాఉద్దిన్,హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.