
నవతెలంగాణ -తాడ్వాయి
ఇటీవల విస్తరంగా కురిసిన వర్షాలకు జంపన్న వాగు ఉగ్రరూపానికి నిస్సహాయులైన నార నార్లాపూర్ గ్రామానికి చెందిన 150 వరద బాధిత కుటుంబాలకు, రెండు లక్షల రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులు బుధవారం ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క సూచనల మేరకు ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం రిజిస్టర్ నెంబర్ 31 94 ఐ ఎన్ టి యు సి అనుబంధ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నడు లేని విధంగా జంపన వాగు పొంగిపొరడం ఇంత నష్టం వాటిల్లడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ప్రకాష్, జాయింట్ సెక్రెటరీ గోవింద్ రెడ్డి, నాయకులు విజయభాస్కర్, బుచ్చిరెడ్డి, రామ్మోహన్ భూషణ్, రవి, సీతారాం, స్థానిక ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు, ప్రజారోగ్య, వైద్య ఉద్యోగుల సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.