మండలాల్లోని నాలుగు గ్రామాల రోడ్ల నిర్మాణానికి 8 కోట్ల 10 లక్షల నిధులు మంజూరు..

నవతెలంగాణ- మద్నూర్

మద్నూర్ మండలంలోని రాచూర్, సోముర్, డోంగ్లి మండలంలోని లింబూర్ వాడి, ఇలేగావ్, గ్రామాల రోడ్ల అభివృద్ధికి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే కృషి ఫలితంగా ఈ నాలుగు గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి మొత్తం ఎనిమిది కోట్ల 10 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే నిధుల మంజూరు సర్కులర్ కాపీని జారీ చేశారు. ఏండ్ల తరబడి ఎదురు చూసే గ్రామాల ప్రజల అవస్థలు తీరనున్న యి డోంగ్లి మండలంలోని లింబూరు వాడి గ్రామ ప్రజలకు బిటి రోడ్డు లేక ఇరు గ్రామాల మధ్యలో వాగు పై వంతెన లేక ఏళ్ల తరబడి ఆ వాడి గ్రామ ప్రజలు వర్షాకాలంలో అవస్థలు పడుతూ వస్తున్నారు. వారి కళ నెరవేర్చేందుకు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే లింబూర్ గ్రామం నుండి వాడి గ్రామం వరకు అలాగే మధ్యలో వాగ్ పైన వంతెన నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు మంజూరు చేయించారు దొంగిలి మండలంలోని మరో గ్రామమైన ఇలేగావ్ గ్రామ ప్రజల అవస్థలు గుర్తించి జెడ్పి రోడ్డు మాదన్ ఇప్పర్గా రోడ్డు నుండి ఇలేగావ్ వరకు రోడ్డు నిర్మాణానికి ఒక కోటి 80 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. అదేవిధంగా మద్నూర్ మండలంలోని ఈ మధ్యకాలంలో హల్చల్ అయిన రాచూర్ గ్రామ ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే అనుమంతు సిందే ప్రత్యేకంగా కృషి చేస్తూ 161 వ జాతీయ రహదారి కందరుపల్లి నుండి రాచూరు వరకు రోడ్డు నిర్మాణానికి రెండు కోట్ల 70 లక్షల నిధులు మంజూరు చేయించారు. ఇక మద్నూర్ మండలంలోని పిడబ్ల్యుడి రోడ్డు నుండి సోముర్ గ్రామానికి రోడ్డు నిర్మాణానికి 60 లక్షల రూపాయలు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే హనుమంతు సిండే జారీచేసిన నిధుల మంజూరు సర్కులర్ కాపీలో పేర్కొన్నారు. ఈ నాలుగు గ్రామాల ప్రజల అవస్థలు రోడ్ల నిర్మాణాలతో తీరనున్నాయి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల ప్రజలు అభినందనలు వ్యక్తపరుస్తున్నారు.