మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందున్న మూడవ చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.రాధాకష్ణ (చినబాబు) ఈ సూపర్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా స్టైలిష్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న మహేష్ సూపర్ మాస్ పోస్టర్లను చిత్ర బందం విడుదల చేసింది. ఈ పోస్టర్లలో మహేష్‌బాబు లుక్‌ని చూసి ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ కష్ణ జయంతి సందర్భంగా మాస్ స్ట్రైక్ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ అద్భుతమైన స్పందనతో వైరల్‌గా మారింది. గ్లింప్స్‌కి తమన్ అందించిన నేపథ్య సంగీతం విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అత్యంత విజయవంతమైన కలయికగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలను దష్టిలో పెట్టుకుని, తమన్ ఈ చిత్రానికి కూడా అద్భుతమైన సంగీతాన్ని అందించడానికి కషి చేస్తున్నారు. ఈనెల ద్వితీయార్థంలో ఈ సినిమా షూటింగ్‌ని పునఃప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, మీనాక్షి చౌదరి మరో కథానాయికగా మహేష్‌బాబు సరసన మెరవబోతున్నారు.