జింకల బెడదతో పంట నష్టాలపై తలలు పట్టుకుంటున్న రైతన్న

– జింకల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు రైతన్నల విజ్ఞప్తి
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి శివారు ప్రాంతాల్లో జింకల బెడద అధికమయ్యాయి వానాకాలం పంట సాగులో భాగంగా ఈ మండలాల్లో అత్యధికంగా సోయా పంట సాగు చేశారు జింకల బెడదలు వానాకాలం పంట భారీగా నష్టం కలిగిస్తున్నాయని వ్యవసాయదారులు పంట నష్టాలపై తలలు పట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం జింకల విడుదలను నివారణ చర్యలు చేపట్టాలని రైతన్నలు విజ్ఞప్తి చేస్తున్నారు సాగుచేసిన పంటలను మందలు మందలుగా పంట చేనుల్లో పంటను తినడమే కాకుండా చేనుల్లో ఎక్కడపడితే అక్కడ మందలకు మందలు చేరి పంటను నాశనం చేస్తున్నాయని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడా ఏ గ్రామ శివారులో చూసినా వందల సంఖ్యలో జింకలు మందలు మందలుగా ఉన్నట్లు పంట చేను కాపలా చేయడంలో జింకలతో ఇబ్బందులు పడవలసి వస్తుందని జింకల కాపల కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మందలకు మందలు ఒక రైతన్న చేను నుండి మరొక రైతన్న చేనులో దుంకుడు ఎగురుడు పంటను తినడం తొక్కడం ఎకరాల కొద్ది పంటలు జింకలు బెడదతో నాశనం అవుతున్నాయని వాటి నివారణ చర్యలు చేపట్టాలని మద్నూరు ఉమ్మడి మండలాల రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.