నర్సాపూర్ లో ఇంటింటికి ఆరు మొక్కల పంపిణీ

నవతెలంగాణ కమ్మర్ పల్లి
మండలంలోని నర్సాపూర్ గ్రామంలో శుక్రవారం ఇంటింటికి ఆరు  మొక్కల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ సక్కారం పెండే ప్రభాకర్ చేతుల మీదుగా మహిళ సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి ఆరు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి ఇంటిలో తప్పనిసరిగా కనీసం ఆరు మొక్కలనైనా నాటాలన్నారు. నాటిన మొక్కలను సంరక్షించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంటి ఆవరణలో మొక్కలను పెంచడం ద్వారా ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. మొక్కలను నాటి సంరక్షించడం తమ బాధ్యతగా మహిళలు భావించాలన్నారు.ఈ కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శి జులేఖ, గ్రామ మహిళ సంఘాల అధ్యక్షులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.