ఇటలీ తీరంలో పడవ మునిగి 43 మంది మృతి

– ఆ మూడు దేశాలకు చెందిన శరణార్థులే..
– ఇటలీ కోస్ట్‌గార్డ్స్‌
రోమ్‌ : ఇటలీ తీరానికి శరణార్థులతో వస్తున్న పడవ ఆదివారం తెల్లవారుజామున మునిగిపోవడంతో కొన్ని నెలల చిన్నారిసహా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పడవలో ఇరాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్తాన్‌కు చెందిన శరణార్థులున్నారనీ, వారిలో 80 మందికిపైగా ప్రాణాలతో బయటపడ్డారు ఇటలీ కోస్ట్‌గార్డు అధికారులు తెలిపారు. 20 మీటర్ల పొడవున్న బోటులో తప్పనిసరి పరిస్థితుల్లో కిక్కిరిసి ప్రయాణించారు ఇటాలియన్‌ ప్రీమియర్‌ జార్జియా మెలోని పేర్కొన్నారు. అలల ఉధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢకొీట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు. కోట్రోన్‌ ప్రావిన్స్‌లోని కలాబ్రియా గ్రామం సముద్రతీర రిసార్ట్‌ అయిన స్టెకాటో డి కుట్రో ఒడ్డుకు కొట్టుకువచ్చిన 28 మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ డైవర్లు వెలికితీశారు. ఈ బోటు ఎక్కడి నుంచి బయల్దేరిందో తెలియరాలేదు.