పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

– అర్ జి పి ఆర్ ఎస్ జిల్లా కోఆర్డినేటర్ గా ఎనుగంటి. గంగాధర్ గౌడ్.
నవతెలంగాణ – మాక్లూర్
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అర్ జి పి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు ఏ. గంగాధర్ గౌడ్ అన్నారు. మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన ఎనుగంటి గంగాధర్ గౌడ్ జిల్లా  అర్జీ పి ఆర్ ఎస్ కోఆర్డినేటర్ గా శనివారం నియామకం చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నానని తెలిపారు.  నా మీద ఉంచిన నమ్మకంతో రాబోయే ఎన్నికల్లో నా వంతు కృషిచేసి  పార్టీని మరింత బలోపితం చేస్తానని చెప్పారు. నాకు సహకరించిన నాయకులకుడిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి,  పీసీసీ వర్కింగ్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్,  మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ  మధుయాష్కీ గౌడ్, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, కృతజ్ఞతలు తెలిపారు.