నాయి బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఏ దుర్గారాణి

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 

నాయి బ్రాహ్మణ మహిళల హక్కుల కోసం కృషి చేస్తానని రాష్ట్ర నాయి బ్రాహ్మణ  మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలుగా ఏ దుర్గారాణి అన్నారు. శనివారం హనుమాన్ టెకిడీలోని బీసీ సాధికారత భవన్ లో రాష్ట్రస్థాయి నాయి బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. సందర్భంగా  నాయి బ్రాహ్మణ మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఏ దుర్గారాణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయి బ్రాహ్మణ మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర నాయి బ్రాహ్మణ మహిళా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం రాష్ట్ర అధ్యక్షురాలుగా ఏ దుర్గారాణి. ఉపాధ్యక్షురాలుగా బి భాగ్యలక్ష్మి. ప్రధాన కార్యదర్శిగా వై రేణుక. కోశాధికారిగా ఎన్ స్వప్న. జాయింట్ సెక్రటరీగా నాగరాణి. ఆర్గనైజ్ సెక్రటరీగా జి నవనీత. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉషారాణి కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ విద్య .ఎం రజిత. బి అక్షయ.ఈ శాంభవి ఎం. శిరీష. సిహెచ్ ఉమారాణి.నవనీత తదితరులు ఎన్నికయ్యారు. రానున్న రోజుల్లో పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని తెలిపారు