
గాంధారి మండలంలోని ముదోలి గ్రామానికి చెందిన చింతకింది మొగులయ్య (40) తన వ్యవసాయ పొలానికి దగ్గరలో ఉన్న వాగులో చేపల వేటకని వెళ్లి ప్రమాదవశాత్తు దానిలో పడి వలలో తట్టుకొని మరణించినాడు అని గాంధారి సుధాకర్ తెలిపారు. మృతుడు ఈరోజు ఉదయం తన ఇంటి నుండి చేపల వేటకని వెళ్ల గా ఆ వైపు వెల్లేవారికి కనిపించకపోవడంతో మృతి ని కుమారుడు వెళ్లి వలలో చెక్ చేయగా వలకు తట్టుకొని మృతి చెంది ఉన్నాడు. మృతునికి ముగ్గురు కుమారులు భార్య ఉన్నది. మృతుని భార్య చింతకింది లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.