జాలి చూపించండి

Show pity..– స్పౌజ్‌ బదిలీలను వెంటనే చేపట్టండి : మంత్రి హరీశ్‌ రావుకు స్పౌజ్‌ ఉపాధ్యాయ దంపతుల వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నరకయాతన అనుభవిస్తున్న తమ పట్ల జాలి చూపించాలని 13 జిల్లాల స్పౌజ్‌ ఉపాధ్యాయ దంపతులు వేడుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయ దంపతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 19 నెలలుగా కుటుంబాలకు దూరమైన తమకు విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తమ వారందరూ శోక సముద్రంలో ఉన్నారనీ, సమస్య పరిష్కరించాలని కోరారు. మహిళా ఉపాధ్యాయులు మంత్రి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.