విద్యార్థులలో జాతీయ భావం పెంపొందేలా గాంధీ చిత్ర ప్రదర్శన: కలెక్టర్

నవతెలంగాణ- తాడ్వాయి 
విద్యార్థులలో జాతీయ భావం పెంపొందేలా  జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శనను  జిల్లాలోని సినిమా హాళ్లల్లో ఉచితంగా  ప్రదర్శించడం జరుగుతుందని, విద్యార్థులు తిలకించే  విధంగా చక్కటి ప్రణాళిక  రూపొందించుకోవలసినదిగా  జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్  మండల విద్యాధికారులు, తహసీల్ధార్లు, రవాణా శాఖాధికారులకు  సూచించారు.  ఆదివారం అధికారులతో ఏర్పాటు చేసిన టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ  స్వాతంత్య్ర  దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 14 నుండి 24 వరకు  జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, గత స్వాతంత్య్ర  వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన మాదిరే  విద్య, రెవిన్యూ, రవాణా, పొలిసు శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయవలసినదిగా సూచించారు. 14వ తేదీన ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు, 16 నుండి 24వ తేదీ వరకు ఉదయం10 నుండి మధ్యాహ్నం 1.30 గంటలకు వరకు చిత్ర ప్రదర్శన ఉంటుందని అన్నారు. కాగా  15వ తేదీన    స్వాతంత్ర దినోత్సవం, 20న  ఆదివారం కారణంగా చిత్ర ప్రదర్శన ఉండదని కలెక్టర్ పేర్కొన్నారు. సినిమా హాళ్ల సీటింగ్ సామర్థ్యం మేరకు ఏ రోజు ఏ పాఠశాల విద్యార్థులను సమీప థియేటీర్లకు తీసుకెళ్ళలో  ప్రణాలిక రూపొందించుకొని విద్యార్ధులను ధియేటర్ ల వద్దకు తీసుకెళ్ళి  సినిమా ప్రదర్శన అనంతరం వారిని క్షేమంగా  గమ్యస్థానాలకు చేర్చేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసుకోవలసిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. తహసీల్ధార్లు సినిమా యాజమాన్యాలతో మాట్లాడి స్క్రీనింగ్ జరిగేలా చూడాలన్నారు.  దేశానికి స్వాతంత్రం కోసం అహింసా మార్గంలో నిరంతర పోరాటం చేసిన జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రను తెలియజేసే చిత్రాన్ని విద్యార్ధులు వీక్షించి జాతీయ  భావాన్ని చాటే విధంగా చూడాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో ఆర్.టి.ఓ. వాణి , ఇంచార్జి  డీఈఓ ఉమారాణి, తహసీల్ధార్లు, ఎంఈఓలు, ఎంవిఐ లు పాల్గొన్నారు.