– సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్
నవతెలంగాణ-షాబాద్
కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తూ, వారికి అం డగా సీఐటీయూ ఉంటుందనిసీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ అన్నారు. ఆదివారం షాబాద్ మం డల కేంద్రంలో నూతనంగా సీఐటీయూ జెండాను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 6 కోట్ల 20 లక్షల మందితో అతిపెద్ద కార్మిక సం ఘంగా సీఐటీయూ ఉందన్నారు. నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్న ఏకైక సంఘం సీఐటీయూ కార్మిక సంఘమని తెలిపారు. ముఖ్యంగా సీఐటీయూ కార్మికుల సంక్షేమం కోసం నిరంత రం పాలకవర్గాలపై పోరాటం చేస్తుందని, కార్మికులకు కనీ స వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాలను ప్రశ్నిస్తుందన్నారు. గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ, ఆశ, మిషన్ భగీరథ కం పెనీల్లో పనిచేసే కార్మికుల సమస్యలపై నిరంతరం పోరా టం చేస్తుందని తెలిపారు. తమకు న్యాయం చేయాలని 35 రోజులుగా గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె చేశా రని, వారి సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాల న్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు నరసింహ, గ్రామపంచాయతీ కార్మికులు రవి, పగులయ్య, సురేష్, బాబయ్య, నరసింహ, రత్నమ్మ, స్వరూప, లక్ష్మి, అర్జున్, నర్సింలు, చోటే మియా, రవి, తదితరులున్నారు