విద్యార్థులకు టై బెల్టుల పంపిణీ..

నవతెలంగాణ-బెజ్జంకి 

మండల పరిధిలోని గుండారం ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ శెట్టి లావణ్య సోమవారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ.. పాఠశాల ఉపాధ్యాయుడు చెలుకల తిరుపతి రెడ్డి తన స్వంత ఖర్చులతో టై,బెల్టులు సమకూర్చి విద్యార్థులకు అందించాలనే గోప్ప సంకల్పం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ పాఠశాల అభివృద్ధిలో బాగాస్వాములవ్వాలని సూచించారు. అనంతరం ఉపాద్యాయుడు తిరుపతి రెడ్డిని సర్పంచ్ లావణ్య శాలువా కప్పి సన్మానించారు.బోధన సిబ్బంది, విద్యార్థులు,గ్రామస్తులు పాల్గొన్నారు.