
రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరిగిన రాష్ట్రస్థాయి యూత్ ఫెస్ట్ 5 కే రన్ (5 కిలోమీటర్ల పరుగు పందెంలో )లో గుర్రపు రోజా ద్వితీయ స్థానం సాధించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన బి.ఏ ద్వితీయ సంవత్సరానికి చెందిన గుర్రపు రోజా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాల దాస్ నగర్, నిజామాబాద్ విద్యార్థిని నీ సోమవారం తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి శాలువా మెమొంటో తో సన్మానించ అభినందించారు.ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ మహిళలు విద్యతోపాటు క్రీడారంగంలో ముందుండి రాష్ట్ర, దేశ ఖ్యాతిని అంతర్జాతీయంగా నిలబెట్టాలని సూచించారు.ఎన్ఎస్ఎస్ వాలంటీర్ గా ఉన్న గుర్రపు రోజా నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టి గురుకుల పాఠశాల అధ్యాపకులు అందించిన చైతన్యంతో క్రీడలలో ముందుకు పోతుందన్నారు. ఈ అభినందన కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ రవీందర్ రెడ్డి, గురుకుల కళాశాల అధ్యాపకులు డాక్టర్” యం.సరిత
ఎన్ఎస్ఎస్ జూనియర్ అసిస్టెంట్ సురేష్ పాల్గొన్నారు.